సిరికొండ, వెలుగు: భూమిలేని పేదలకు భూములు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్, మాట నిలబెట్టకోలేదని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆరోపించారు. సిరికొండ మండలంలోని కొండాపూర్, గడ్డమీది తండా, ముషీర్నగర్గ్రామాల్లోని పోడు భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడిచినా, ఇంత వరకు చేసిందేమీ లేదన్నారు.30 ఏళ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేస్తున్నవారికి పట్టాలివ్వకపోవడం దారుణమన్నారు.
వేలల్లో దరఖాస్తులు చేసుకుంటే, వందల మందికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పోడు పట్టాలిస్తామన్నారు. కాశీతండా, ముషీర్‌నగర్ గ్రామాల్లోని పలువురు మహిళలు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా కారద్యర్శి భాస్కర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రవి, యూత్ ప్రెసిడెంట్భూషణ్, రమేశ్, జావీద్, మల్లేశ్తదితరులు
పాల్గొన్నారు.