ప్రధాని మోడికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని మోడికి  సీఎం కేసీఆర్ లేఖ

ఎరువుల ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. 2022కల్లా రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని గొప్పలు చెప్పి.. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఐదేళ్లలో అన్ని రేట్లు డబుల్ అయ్యాయన్నారు. పెట్రో రేట్లు పెరగడం కూడా రైతులకు భారమైందన్నారు కేసీఆర్. వ్యవసాయ ఖర్చు విపరీతంగా పెరిగిందని లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. MSPని 150శాతం పెంచామంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర అమలుపై ఎలాంటి మెకానిజం లేదన్నారు సీఎం. రైతులకు సరైన మద్దతు ధర లేదన్నారు. ధాన్యం తక్కువ కొంటున్నారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. రైతులు తమపంటను తక్కువ ధరకు అమ్ముకునేలా కేంద్రం చర్యలున్నాయన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిందన్నారు. కరెంట్ మీటర్లు పెట్టాలన్న నిర్ణయంపై రైతులు ఆందోళనతో ఉన్నారన్నారు. ఎరువులు ధరలు ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగించాలన్నారు.