హైదరాబాద్ : నేషనల్ అండర్–11 బాయ్స్ చెస్ చాంపియన్‌షిప్‌ను సీఎం మాదవేంద్ర ప్రతాప్ శర్మ (మధ్యప్రదేశ్) సొంతం చేసుకున్నాడు. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ట్రోఫీతో పాటు రూ. 70 వేల క్యాష్ ప్రైజ్‌ను అందుకున్నాడు. అద్విక్ అమిత్ అగర్వాల్ (మహారాష్ట్ర, 9.5), సీఎం అరవ్ (తమిళనాడు, 9) వరుసగా రెండు, మూడో ప్లేస్‌లో నిలిచారు.
వీళ్లిద్దరికి ట్రోఫీలతో పాటు రూ. 60, 50 వేలు నగదు బహుమతి లభించింది. అండర్–11 గర్ల్స్ సెక్షన్‌లో దివి బిజేష్ (కేరళ) చాంపియన్‌గా నిలిచింది. ప్రతితీ బోర్డోలోయ్ (కర్ణాటక), ఆద్య గౌడ (కర్ణాటక) వరుసగా సెకండ్, థర్డ్ ప్లేస్‌లను సాధించారు. బాయ్స్, గర్ల్స్‌లో మరో 34 మంది ప్లేయర్లు క్యాష్ రివార్డులను గెలుచుకున్నారు. విజేతలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి బహుమతులు అందజేశారు.