
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. మైనారిటీలను, వారి ఆస్తులను తాము కాపాడుతామని వెల్లడించారు. బుధవారం కోల్‌కతాలో జైన సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మమత చీఫ్ గెస్ట్ గా హాజరై, మాట్లాడారు. "వక్ఫ్ చట్టం కారణంగా మీరు(మైనారిటీలు) బాధపడుతున్నారని, అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు. కానీ, ఆ డివైడ్ అండ్ రూల్ బెంగాల్‌లో అమలు కాదు. నన్ను నమ్మండి. ప్రజలంతా ఐక్యంగా, బలంగా నిలబడితే ఏదైనా సాధ్యమే” అని మమత చెప్పారు.