
పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మతం పేరుతో హింసను ప్రేరేపించకుండా శాంతి ఉండాలని ఆందోళనకు కారులకు సూచించారు.చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి.. కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.
ముర్షిదాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం (ఏప్రిల్12) మాట్లాడుతూ..రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం అనుమతించదు.. మతం పేరుతో ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దు.. ప్రతి ఒక్కరి జీవితం విలువైనంది. రాజకీయ లబ్ది కోసం అల్లర్లను ప్రేరేపించొద్దు. అల్లర్లను రెచ్చగొడుతూ సమాజానికి హాని చేస్తున్నారని Xలో పోస్ట్ చేశారు.
గుర్తుంచుకోండి చట్టాన్ని మేంతయారు చేయలేదు.. కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. మీకు సమాధానం చెప్పాల్సి కేంద్ర ప్రభుత్వం..ఈ విషయంపై మా వైఖరిని స్పష్టం చేశాం..ఈ చట్టానికి ఎట్టి పరిస్థితుల్లో మేం మద్దతు ఇవ్వం..చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయం.కాబట్టి అల్లర్లకు పాల్పడవద్దు అని మమతా బెనర్జీ పోస్ట్ లో రాశారు. అల్లర్లను ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ హెచ్చరించారు.
శుక్రవారం కొత్త వక్ఫ్ చట్టంపై పశ్చిమబెంగాల్ లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో హింస రేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పోలీసు వాహనాలతో సహా అనేక వెహికల్స్ కు ఆందోళనకారులు నిప్పంటించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వాలి. రోడ్లనుమూసివేశారు. పశ్చిమ బెంగాల్లో అల్లర్లు ముదురుతుండటంతో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.