గోవా మరవదు నీ తోవ

సముద్ర తీర రాష్ట్రమైన గోవాలో పవర్ లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీ అంటే పారికర్ . పారికర్ అంటే బీజేపీ. పార్టీ ఆదేశించేది..పారికర్ పాటించేవారు. కొన్నిసార్లు పార్టీయే ఆయన అడుగుల్లో అడుగేసి నడిచేది. ముప్పయి ఏళ్ల వెనక్కివెళ్తే… 1989లో గోవాలో బీజేపీ కార్యకర్తలు కేవలం 4,000 మంది మాత్రమే. మనోహర్ పారికర్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రావటంతో ఈ రోజున ఆ పార్టీ సభ్యుల సంఖ్య 4.2 లక్షలకు చేరింది. దీన్నిబట్టి ఆయన ప్రభావమేంటో చెప్పొచ్చు. రాష్ట్ర జనాభామొత్తం 15 లక్షలైతే అందులో దాదాపు మూడో వంతు కమలదళమే! చిన్నతనం నుంచి చివరి శ్వాస వరకు.. చిన్నతనం నుంచి చివరి శ్వాస వరకు పారికర్ క్రమ శిక్ష ణ కలిగిన ఒక సంఘ్ మెంబర్ గా కొనసాగారు. బాంబే ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, పీజీ డ్రాపవుట్‌ అయినప్పుడు, రాజకీయ రంగప్రవేశసమయంలో.. ఇలా ఎప్పుడూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) చాలక్ గానే వ్యవహరించారు.

తొలిసారిగా 1988లో పారికర్ ను పార్టీలోకి తీసుకోవాలని సంఘ్ నిర్ణయించింది. 1991లో గోవా అసెంబ్లీలో గానీ ఆ రాష్ట్రం నుంచి లోక్ సభకు గానీ బీజేపీ ప్రాతినిధ్యం శూన్యం. అలాంటి పరిస్థితుల్లో ఆయన నార్త్​ గోవా లోక్ సభ సీటుకి పోటీ చేసి ఓడినా, సుమారు 25 వేల ఓట్లు పొందగలిగారు. దీంతో పారికర్ పై బీజేపీకి గురి కుదిరింది. గోవాలో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించిం ది. మూడేళ్లలోనే ఆయన పరిపూర్ణ రాజకీయ నేతగా పరిణతి సాధించారు. రాష్ట్ర రాజధాని పనాజీలో బీజేపీ పాగా వేసి, ఆ సీటుని కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకుంది. 1994 మొదలు ఇప్పటి వరకు పాతికేళ్లుగా అక్కడ కాషాయం పార్టీదే కమాండింగ్ స్టేటస్‌‌. ఆ తరుణంలోనే బీజేపీ మొట్టమొదటిసారిగా గోవా అసెంబ్లీ లోకి నలుగురు సభ్యులతో ఎంటరైంది. పనాజీ నుంచి ఫస్ట్​ టైం ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టిన మనోహర్ పారికర్ ఇక వెనుదిరిగి చూడలేదు. అవినీతి వ్యతిరేక యోధుడిగా పోరాటం సాగించారు. ఫైర్ బ్రాండ్ పర్సనా లిటీతో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలను సాధికారికంగానిలదీశారు. సాధారణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రనే తిరగరాశారు. మెటలర్జికల్ ఇంజనీరిం గ్ నుంచి సోషల్ రీఇంజనీరిం గ్ వరకు.. బాంబే ఐఐటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివిన మనోహర్ పారికర్ ప్రజలు ఇచ్చిన అధికారంతో గోవాలో సోషల్ రీ–ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్​లా పాలన సాగించారు. సంఘ్ నుంచి నేర్చుకున్న సింప్లిసిటీని అనునిత్యం, అడుగడుగునా ఆచరించారు. కుల మతాలకు అతీతంగా జనం మెచ్చిన నాయకుడిలా పేరు తెచ్చుకున్నారు.

పారికర్ సారస్వత బ్రాహ్మణు  డైనప్పటికీ క్రమంతప్పకుండా చర్చిలో ప్రార్థనలకు కూడా హాజరయ్యేవారు. ఎలక్షన్ నామి నేషన్ లు వేసే ముందు పాస్టర్ల నుంచి దైవాశీర్వాదాలు తీసుకునే వారు. ఎన్నికల్లో అపొజిషన్ పార్టీ వాళ్లు తనపై ఎక్కుపెట్టే ‘ఆర్ ఎస్ ఎస్’ విమర్శలను ఐఐటీ, ఇంటలెక్చువల్ ట్యాగ్ లతో సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టేవారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేవారు. పాలి‘ట్రిక్స్ ’లో పోటీ పార్టీల కన్నా ఒక ఆకు ఎక్కువే చదివానని ఎప్పుడూ నిరూపించు కునేవారు. అతి కొద్ది కాలంలోనే రాష్ట్రం నలుమూలలా బీజేపీ ముద్ర వేశారు. పారికర్ విద్యార్హతలు, కరప్షన్ వ్యతిరేక గళం, రాష్ట్రాభివృద్ధి దిశగా చూపిన దూరదృష్టి ఆ పార్టీని బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దాయి. ముందస్తు అనుభవంలేని ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనలో, రాజకీయాల్లో మనోహర్ పారికర్ అవినీతిని సహించేవారు కాదు. కరప్ట్ పొలిటీషియన్ అని తెలిస్తే క్షణం ఆలస్యం చేయకుండాఅరెస్ట్​ చేయించేవారు. సర్కారు వ్యవహారాల్లో ముందస్తు అనుభవం లేకుండానే నేరుగా ముఖ్య మంత్రి అయిన వ్యక్తి మనోహర్ పారికర్. ఫైల్స్ ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవటం, సమస్యలను స్టడీ చేయటం, ప్రజల నాడిని పక్కాగా పట్టుకోవటం, పర్ ఫెక్ట్​ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించటం వంటి వి ఆయన్ని పవర్ ఫుల్ సీఎంని చేశాయి. ప్రభుత్వపరంగా మనోహర్ పారికర్ చేపట్టిన విధానాలు ఒకానొక దశలో తన పార్టీ పాలసీల ప్రభావాన్ని దాటిపోయినట్లు అనిపించేవి.

బీజేపీపై హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉంది. కానీ ఆయన గోవా జనాభా లో 27 శాతం వరకు ఉన్న క్రిస్టియన్లకు ఎంతో చేశారు. వాళ్లతోపాటు ఓబీసీలను, ట్రైబల్స్ ను , మైనారిటీలనూ మరవలేదు. పారికర్ హయాంలో ‘ప్రభుత్వ పాలన ప్రతి ఒక్కరి చెంతకు, ప్రతి ఒక్కరి వికాసానికి ’ అనే రీతిలో సాగింది. దీంతో బీజేపీ 2012లో మొత్తం 40 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 21 స్థానా లను  లిచింది. ఇందులో 14 మంది క్రిస్టియన్లే. నాలుగు సార్లు సీఎం అయినా.. గోవాకి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఎప్పుడూ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేక పోవడమే పారికర్‌‌ పొలిటికల్‌‌ లైఫ్‌ లో పెద్ద వెలితి. పార్టీకి గోవాలో హైకమాండ్ అయినా లోకమాండ్ అయినా పారికరే. ఆయన లేని లోటు బీజేపీకి, ఆ రాష్ట్రానికి తీరనిది. జనం మనసులను గెలిచిన పారికర్ ఏడా ది కాలంగా విధిపై అలుపెరగక పోరాడి శాశ్వతంగా అలిసిపోయారు. ఆయన సేవలను, తోవలను ఆ రాష్ట్ర ప్రజానీకం ఎన్నటికీ మరవదు.