వీడిన ఉత్కంఠ.. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన CM నాయబ్ సింగ్ సైనీ

వీడిన ఉత్కంఠ.. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన CM నాయబ్ సింగ్ సైనీ

చంఢీఘర్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా బీజేపీ అధిక్యంలో దూసుకు వచ్చింది. కౌంటింగ్ మొదటి రెండు రౌండ్లలో వెనుకబడ్డ కాషాయ పార్టీ ఆ తర్వాత జెట్ స్పీడ్‎లో పుంజుకుని లీడింగ్‎లో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో  మెల్లగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ సింగ్రోహాపై గెలుపొందారు. హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా సైతం విజయం సాధించారు. 

ALSO READ | రెజ్లర్ వినేష్ ఫొగట్ ఘన విజయం : ఒలంపిక్స్‌లో ఓడినా.. MLAగా గెలుపు

ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ సావిత్రి జిందాల్ హిస్సార్ అసెంబ్లీ నుండి గెలుపొందారు. రెజ్లింగ్‎కు రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ వినేష్  ఫొగాట్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించింది. తొలి ప్రయత్నంలోనే జులానా సెగ్మెంట్ నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం కొనసాగుతోన్న హర్యానా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆప్, ఐఆఱ్ఎల్డీ, జేజేపీ కనీస పోటీ చూపకుండా చతికిలపడిపోయాయి.