భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తమ పథకాలు అమలుకాకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. రైతుల ప్రయోజనం కోసం ఒడిషాలో అమలవుతున్న కాలియా(KALIA-క్రిషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్ లీ హుడ్ అండ్ ఇన్ కమ్ ఆగ్మెంటేషన్) పథకానికి ఈసీ అడ్డు చెప్పడం ప్రజాస్వామ్యపరంగా సరికాదన్నారు. రబీ సీజన్ లో ఇప్పటికే ఓసారి పథకాన్ని అమలుచేశామనీ.. ఎన్నికల టైమ్ లో పథకాన్ని అడ్డుకోవద్దని ఆయన ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సీజన్ లో రైతులకు నిధులు చాలా అవసరమని ఆయన చెప్పారు.
ఎలక్షన్ ఆఫీసర్ పనితీరు ఏమాత్రం బాగాలేదని నవీన్ పట్నాయక్ సీరియస్ అయ్యారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేస్తే.. దానికి ఈసీ సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో రైతులు తగిన శాస్తి చేస్తారని అన్నారు నవీన్ పట్నాయక్.
కాలియా స్కీమ్ కింద ఒడిశాలో రైతులకు ఏడాదికి రూ.10వేల రూపాయలు అందుతున్నాయి. ఇప్పటికే ఓసారి రైతుల అకౌంట్లలో డబ్బులను వేసింది అక్కడి ప్రభుత్వం. ఎన్నికల వేళ ఈ స్కీమ్ అమలుకు ఈసీ అడ్డు చెప్పింది.