ఇంట్రెస్టింగ్ సీన్: డీజీపీకి చేతులేత్తి మొక్కిన సీఎం నితీష్ కుమార్

ఇంట్రెస్టింగ్ సీన్: డీజీపీకి చేతులేత్తి మొక్కిన సీఎం నితీష్ కుమార్

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్‎కు చేతులెత్తి మొక్కారు. పోలీసు ఉద్యోగానికి కొత్తగా 1239 మంది పోలీస్ అధికారులుగా ఎంపికకాగా.. వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగిస్తూ.. మధ్యలో ఆ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో పోలీసు ఉద్యోగాల నియమకాలు చేపట్టాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీనికి డీజీపీ స్పందిస్తూ.. అనుకోకుండా జరిగిన పరిణామానికి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎంకు ప్రతినమస్కారం చేశారు. తప్పకుండా త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు. దానికి సీఎం నితీశ్ ధన్యవాదాలు తెలిపారు.