గాంధీ మెడికల్​ కాలేజీలో పవర్ ​ఇష్యూపై స్పందించిన సీఎం పేషీ

గాంధీ మెడికల్​ కాలేజీలో పవర్ ​ఇష్యూపై స్పందించిన సీఎం పేషీ
  • చెట్ల కొమ్మలను తొలగించిన సిబ్బంది

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ మెడికల్​ కాలేజీలో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందంటూ శుక్రవారం వెలుగులో  ప్రచురితమైన ‘గాంధీ మెడికల్​కాలేజీలో కరెంట్​ కష్టాలు కథనానికి సీఎం పేషీ స్పందించింది. సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించింది.  

శుక్రవారం ఎలక్ట్రిసిటీ డివిజనల్​ఇంజినీర్​బ్రహ్మానందం, ఏడీఈ ఆదినారాయణ, ఏఈ మోహన్​రావు మెడికల్​కాలేజీకి వచ్చారు. ప్రిన్సిపాల్​ఇందిరను కలిసి కరెంట్​సరఫరాలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతరాయానికి కారణమవుతున్న బాయ్స్​హాస్టల్​వెనక ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.