Delhi Assembly: అంబేద్కర్ ఫొటో వివాదం.. ఢిల్లీ అసెంబ్లీలో రచ్చరచ్చ.. 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్

Delhi Assembly: అంబేద్కర్ ఫొటో వివాదం.. ఢిల్లీ అసెంబ్లీలో రచ్చరచ్చ.. 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం..కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే నిర్వహించిన తొలిసమవేశం రచ్చరచ్చయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసి స్తూ నిరసన తెలిపిన 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తా మంగళవారం(ఫిబ్రవరి 25) ఒక రోజంతా సస్పెండ్ చేశారు.సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేల్లో అతిషి, గోపాల్ రాయ్, వీర్ సింగ్ ధింగన్, ముఖేష్ అహ్లావత్, చౌదరి జుబేర్ అహ్మద్, అనిల్ ఝా, విశేష్ రవి మరియు జర్నైల్ సింగ్ ఉన్నారు.

 సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటం స్థానంలో మోదీ ఫొటో పెట్టారని.. అంబేంద్కర్ కంటే మోదీ గొప్పవాడా అని ఆప్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈఅంశాన్ని లేవనెత్తినందుకు సభను సస్పెండ్ చేశారు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పారు. అంబేద్కర్ ఫొటో తిరిగి ఢిల్లీ సీఎం ఆఫీసులో పెట్టేవరకు ఆప్ నిరసన కొనసాగిస్తుందని అన్నారు.