పిట్లంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పిట్లంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పిట్లం, వెలుగు: సీఎం సహయనిధి చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అందజేశారు. సోమవారం మద్నూర్​ మార్కెట్​ కమిటీ,  జుక్కల్​ క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్సచేసుకోలేని  పరిస్థితిలో ఉన్న వారికి సీఎం సహయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మద్నూర్​ నుంచి శబరిమలకు వెళ్తున్న స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్నూర్​ మార్కెట్​ కమిటీ అధ్యక్షురాలు సౌజన్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.