
హైదరాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ప్రదర్శనను ప్రారంభిం చారు కేంద్ర రక్షణమంత్రి, సీఎం రేవంత్ రెడ్డి. సీవీరామన్, అబ్దుల్ కలాం విగ్రహాలకు రాజ్ నాథ్, రేవంత్ రెడ్డి నివాళులర్పిం చారు.
ఈ ప్రదర్శనలో DRDO, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సెలెన్స్ సంయుక్తంగా రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఇలాంటి వైజ్ణానిక ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో విద్యార్థులకు రక్షణ వ్యవస్థపై మరింత అవగాహన వస్తుందన్నారు.
ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది.. ఇందులో 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్కూల్స్, ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు 30వేల మందికి ఈ ప్రదర్శన చూసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.
ప్రదర్శనలో యుద్ద పరికరాల పనితీరు , వాటి తయారీ పరిజ్ణానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. మార్చి1,2 తేదీల్లో సాధారణ ప్రజలకు ప్రదర్శన సందర్శించేందుకు అవకాశం కల్పించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ , స్పేస్ లపై పరిజ్ణానంతో పాటు ఈ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తారు.