ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అద్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజల మదిలో నిలిచిపోయారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులు లక్షలాదిగా ఉన్నారని అన్నారు.
వైఎస్ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని అన్నారు. ఎర్రటి ఎండలో వైఎస్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. వైఎస్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని అన్నారు.ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అంటే వైఎస్ పేరు గుర్తొస్తుందని అన్నారు.