- మహాశివరాత్రి సందర్భంగా రాజన్నకు పట్టువస్త్రాల సమర్పణ
- సీఎం సభా స్థలిని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పర్యటించనున్నారు. రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించే సభా స్థలాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో జిల్లా ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
వేములవాడలో జరిగే మహా శివరాత్రి జాతర మొదటి రోజు సీఎం హాజరవుతారన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 7 వ తేదీన స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, డీఎస్పీ నాగేంద్ర చారితో పాటు ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.