
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు రూ.లక్షా 58 వేల కోట్లని సీఏం స్పష్టతనిచ్చారు. కేసీఆర్ హయాలంలో చేసిన అప్పులపై రూ. లక్షా 53 వేల కోట్లు చెల్లించినట్లుగా తెలిపారు. తాము చేసిన అప్పులు కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దేందుకేనని ఘాటు సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్.
రెండు దఫాలు పాలించిన బీఆర్ఎస్ తమకు రూ.8.19 లక్షల కోట్ల అప్పు ఇచ్చి వెళ్లిందని తెలిపారు సీఎం రేవంత్. ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.7.38 లక్షల కోట్లు ఉందని చెప్పారు. 2023-25 వరకు చేసిన అప్పు రూ.లక్షా 58 వేల కోట్లని చెప్పిన సీఏం.. కేసీఆర్ చేసిన అప్పు రూ.88 వేల కోట్లు చెల్లించామని అన్నారు. అందులో మిత్తి రూ.64 వేల 768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
Also Read:-ఇందిరమ్మను అమ్మ .. తరువాత ఎన్టీఆర్ అన్న అయితే .. ఇప్పుడు నేను రేవంత్ అన్నను..
తాము అప్పులు చేస్తున్నట్లుగా విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కట్టడానికే సరిపోతుందని అన్నారు. అప్పు అంటే బ్యాంకుల నుంచి తెచ్చింది మాత్రమే అప్పు కాదు.. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు కూడా అప్పులేనని ఈ సందర్భంగా అన్నారు.
తాము చేసింది చేసినట్లు చెబుతామని.. చేయనిది వివరిస్తామని అన్నారు. ప్రజలే తమ బాస్ లని.. వారికే వివరిస్తామని చెప్పారు సీఎం. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదని, తాను చెప్పేది అబద్ధమని కేసీఆర్ ను నిరూపించమనండని సవాల్ విసిరారు. ఫాం హౌజ్ లో దాక్కున్నా కేసీఆర్ ను బయటికి తీసుకొచ్చే శక్తి తమకుందని సీఎం రేవంత్ ఫైరయ్యారు.