
- నేను సీఎం అయిన రోజే ఆయన ఆయన గుండె పగిలింది
- నాకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది
- కేసీఆర్.. పిల్లలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తుండు
- ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలె
- ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు
- కాంగ్రెస్ సర్కారు తెచ్చిన స్కీలు ఏ రాష్ట్రంలోనూ లేవు
- మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నిన్నటి ఎల్కతుర్తి సభలో మాజీ సీఎం కేసీఆర్ అక్కసు వెళ్లగక్కారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే ఆయన గుండె పగిలిందని చెప్పారు. నక్సల్స్ తో శాంతి చర్చలపై డిస్కషన్ కోసం ఇవాళ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కేసీఆర్ ని ఆయన మండిపడ్డారు. ఆయన స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని విమర్శించారు. కేసీఆర్ సభకు అవసరమైనన్ని బస్సులు సమకూర్చామని చెప్పారు. గతంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని, దీనిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేరని అన్నారు. ఒక దేశాన్ని ఓడించిన ఘన చరిత్ర ఇందిరాగాంధీదేనని అన్నారు. కేసీఆర్, మోదీ వాళ్ల వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినన్ని స్కీంలు ఏ రాష్ట్రంలో అమల్లో లేవని అన్నారు. మాట్లాడితే కేసీఆర్ పిల్లగాళ్లు అని కేటీఆర్, హరీశ్ ను అంటున్నారని, అలాంటప్పుడు వాళ్లనే ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని ప్రశ్నించారు. నిన్నటి కేసీఆర్ స్పీచ్ లో పసలేదని అన్నారు.
నమ్ముకున్నోళ్లను మరువ
కొంత మంది అధికారుల పని తీరు తెలిసినా, అవసరం ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందన్నారు. కలెక్టర్ల మార్పు వేరే విషయమని, అవసరమైన మార్పులు చేసుకుంటామని రేవంత్ రెడ్డి వివరించారు. తనను నమ్ముకున్న వారిని ఎప్పటికీ మర్చిపోనని, వారిలో ఒకరైన దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు. ఓపికగా ఉన్న వారికే తన నుంచి బాధ్యతలు వస్తాయని అన్నారు.
ఆపరేషన్ కగార్ జాతీయ విధానం
మావోయిస్టులతో శాంతి చర్చలపై సీఎ రేవంత్ రెడ్డి స్పందిస్తూ దీనిపై జాతీయ విధానం తీసుకోవాల్సి ఉందని అన్నారు. గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేస్తామని వివరించారు. దీనిపై కేకే, జానారెడ్డి, దిగ్విజయ్ సింగ్ తో చర్చించినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.