కాంగ్రెస్ అంటేనే గోల్డెన్ గ్యారంటీ.. మోదీ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన రేవంత్

కాంగ్రెస్ అంటేనే గోల్డెన్ గ్యారంటీ.. మోదీ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన  రేవంత్

మహారాష్ట్ర సభలో తెలంగాణ రుణమాఫీపై మోదీ విమర్శలను తిప్పికొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారన్నారు  రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రైతు రుణమాఫీకి సంబంధించిన హామీని వచ్చిన ఏడాదిలోపే అమలు చేశామని గుర్తు చేశారు. 22లక్షల మంది రైతులకు ఇది లబ్ధి చేకూరిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇది అతిపెద్ద రుణమాఫీ అని తెలిపారు. మా ప్రయత్నాలు రైతుల సంక్షేమం పట్ల అంకితభావాన్ని చూపుతున్నాయని చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో మీ పూర్తి సహకారం అవసరమన్నారు రేవంత్ రెడ్డి. 

Also Read :- పదేండ్లలో KCR ఏనాడైనా సెక్రటేరియట్‎కు వచ్చారా..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయడం లేదని మహారాష్ట్ర సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు.  మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు అక్టోబర్ 6న రేవంత్ రెడ్డి లిఖిత పూర్వకంగా తన ఎక్స్ లో  బదులిచ్చారు. 27 రోజుల్లోనే  22 లక్షల 22 వేల 67 మంది రైతులకు 17 వేల 869 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతు రుణాలు త్వరలోనే  రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్ .