లిక్కర్ స్కాం పార్టనర్ ను తెలంగాణలో ఓండించామని, అసలు పార్టనర్ ను ఢిల్లీలో ఓడిస్తామని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అవినీతిని అడ్డుకుంటే చాలు, ఆ నిధులతో పేదలకు మంచి చేయవచ్చునని, తెలంగాణలో అదే చేశామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని ఆగం పట్టించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ రెండు పథకాల పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:
Also Read :- చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
మోదీ, కేజ్రీవాల్ ఢిల్లీని ఆగం పట్టించారు
షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ అభివృద్ధి జరిగింది
ఢిల్లీ మెట్రో, సీఎన్ జీ వాహనాలు కాంగ్రెస్ తెచ్చింది
కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టకుండా.. సెలవులివ్వడంపైనే మోదీ, కేజ్రీవాల్ పోటీ
3 సార్లు అధికారంలోకి వచ్చినా ఢిల్లీని అభివృద్ధి చేయలేకపోయారు
ఢిల్లీని బాగు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ గ్యారెంటీలతో ఢిల్లీ పేదలకు మేలు
మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలి
ఢిల్లీలో రూ.500 సిలిండర్, 300 యూనిట్లలోపు కరెంటు ఉచితం
తెలంగాణలో ప్రతి హామీని అమలు చేస్తున్నాం
రూ.2 లక్షలలోపు ఉన్న రైతు రుణమాఫీ చేశాం
21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం
ఒకే ఏడాదిలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం
మహిళలు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం.
ఇప్పటి వరకు 120 కోట్ల మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు.
కేసీఆర్ తెలంగాణ ను దోచుకున్నారు
పెట్టబడుల కొరకు దావొస్ వెళ్తున్నాం, వచ్చాక ఎన్ని నిధులు తీసుకొచ్చమో చెప్తాం
పీఎం నరేంద్ర పేదలకు చేసిందేమీ లేదు.. అంతా కార్పోరేట్లకు తోచిపెట్టాడు
రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసాడు.
మాఫీ చేసిన 16 లక్షల కోట్ల రూపాయలపై మీడియా ఎందుకు ప్రశ్నించలేదు