రైతు బంధు పేరున గత ప్రభుత్వం దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసాపై చర్చలో భాగంగా రైతు బంధులో అవకతవకలు జరిగాయని సీఎం తెలిపారు. హైవేలు, ఔటర్ రింగు రోడ్డు భూములకు, ప్రభుత్వం సేకరించిన భూములకు, లేయౌట్ చేసిన రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇచ్చారని అన్నారు.
క్రషర్లు, మైనింగ్ భూములకు, రాళ్లకు, రప్పలకు, దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండి పడ్డారు. ఏటా మూడు కోట్ల ఎకరాలకు రైతు బంధు ఇచ్చారని, నకిలీ పట్టాలతో కూడా రైతు బంధు తీసుకున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నామని, మన వారే అన్నట్లుగా వ్యవహరించి రైతు బంధు ఇచ్చి వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.