
తెలంగాణలో ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు . బలహీన వర్గాలకుఅండగా ఉండాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రవేశపెట్టామన్నారు. 2024 ఫిబ్రవరి 4న కేబినెట్ లో తీర్మానం చేశాం..2025ఫిబ్రవరి 4న కులగణన నివేదకకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఫిబ్రవరి 4ను ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని చెప్పారు రేవంత్ .
ALSO READ | పార్టీలకతీతంగా ప్రధానిని కలుద్దాం.. బీసీ కోటా సాధిద్దాం : సీఎం రేవంత్ రెడ్డి
తాము చేసిన కులగణన నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పారు సీఎం రేవంత్. 3 కోట్ల55లక్ష్లకు మందికి పైగా సర్వేలో సంపూర్ణ వివరాలు ఇచ్చారని చెప్పారు . ఒకసారి సర్వేలో పాల్గొనని వాళ్లకు రెండోసారి అవకాశం ఇచ్చామన్నారు. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆఫీసర్లు కులగణన సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. బీసీ జనాభా 56 శాతమని కులగణనలో తేల్చామన్నారు రేవంత్.
42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్ . రాజకీయంగా కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. వివాదాలకు తావులేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. బీసీలకు విద్యా,ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్.