
రేపటి లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కు పార్టీ నేతలు, మంత్రులు,ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేతలలో జూమ్ సమావేశమయ్యారు సీఎం. నేతలు అందరు అలర్ట్ గా ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్ర దగ్గర ఏజెంట్లు ప్రతి రౌండ్ ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ప్రధానంగా ఎంపీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. మరోవైపు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.