కేసీఆర్ వల్ల.. 25 ఏళ్లకు ఉద్యోగం చేయాల్సినోళ్లు.. 35 ఏళ్లకు చేరారు : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వల్ల.. 25 ఏళ్లకు ఉద్యోగం చేయాల్సినోళ్లు.. 35 ఏళ్లకు చేరారు : సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని, ముందుండి ఉద్యమాన్ని నడిపించారని సీఎం  అన్నారు. విద్యార్థుల పేరు చెప్పి గద్దెనెక్కి విర్రవీగారని బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు కురిపించారు.  కేసీఆర్ వల్ల 25 ఏళ్లకు ఉద్యోగం చేయాల్సినోళ్లు 35 ఏళ్లకు చేరారని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు సీఎం రేవంత్. 

 నాలుగు ఉద్యోగాలు పీకేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పానని, అన్నట్లుగానే ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని, ఇంకా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. JL, పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. 

జూనియర్ లెక్చరర్లుగా 1292 మందికి, అలాగే 240 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో జెఎల్ ఉద్యోగాలలో 794 మంది పురుషులు, 498 మంది మహిళలకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. పాలిటెక్నిక్ లో పురుషులు 177,   మహిళలు 63 మందికి నియామక పత్రాలు అందజేశారు. 

ALSO READ | బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారు..? ప్రభుత్వ విప్లు, MLAలకు సీఎం క్లాస్

 తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని, ముందుండి ఉద్యమాన్ని నడిపించారని సీఎం  అన్నారు. విద్యార్థుల పేరు చెప్పి గద్దెనెక్కి విర్రవీగారని బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కామెంట్స్.. 

ఈ ప్రజా ప్రభుత్వంలో మీ పాత్ర ఎంతైనా ఉంది
12 ఏండ్లు మీ జీవితం వృద్ధాగా పోయింది
నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి మీకోసమే పనిచేస్తున్నా
ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా
విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. భవిష్యత్తు పెట్టుబడి
ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగు పడుతుంది.. ఆ ఊరిలో ప్రభావం చూపిస్తారు 
విద్యా శాఖ ఆధారంగా తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది
గత పదేండ్లుగా విద్యారంగాన్ని, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారు
ఒకమనిషి జీవితంలో ఎంత కోల్పోయాడో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలి
ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుండి ఉద్యోగాల భర్తీ జరుగుతోంది 
ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ జరుగుతోందని 
గత ప్రభుత్వంలో పేపర్ లీకులతోనే సరిపోయింది 
మెగా డీఎస్సీ వేసి రెండు నెలల్లోనే భర్తీ చేశాం 
విద్యాశాఖను ప్రక్షాళన చేశాం
దేశంలోనే విద్య శాఖ చివరి నుండి రెండో స్థానంలో వున్నాం 
కేరళతో పోటీపడాల్సిన తెలంగాణ కిందది పడిపోవడం బాధాకరం 
విద్యవస్థలో మార్పులు తెస్తున్నాం 
ఉద్యోగం సాదించడంతోనే మీ పని పూర్తి కాలేదు 
తెలంగాణాలో విద్యావ్యవస్థను పటిష్టం చేసే పనిలో నిమగ్నమవ్వాలి 
కసితో పనిచేయండి