సియోల్లో చుంగ్ గేచంగ్ నదిని సందర్శించిన సీఎం రేవంత్

 సియోల్లో  చుంగ్ గేచంగ్ నదిని సందర్శించిన సీఎం రేవంత్

దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని చుంగ్ గేచంగ్ నదీ పరిసరాలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు బృందం. హైదరాబాద్  మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఇందులో భాగంగా చుంగ్ గేచంగ్ నదీ వివరాలు తెలుసుకున్నారు.

చుంగ్ గేచంగ్ నదీ ... మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కు అనేక ఆలోచనలను కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఈ నది 11 కిలోమీటర్ల వరకు  విపరీతమైన కలుషితాలతో ఉండేది. 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దారు. సియోల్ నగరవాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఏటా 19 కోట్ల మంది  పర్యాటకులు సందర్శిస్తున్నారు.