విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్

 విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ యూనివర్సిటీలకు వరాల జల్లులు కురిపించారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేయనున్నట్లుప్రకటించారు. అదేవిధంగా ప్రొఫెసర్ల ఏజ్ లిమిట్ ను 60 నుంచి 65కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. 

రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ల సేవలు యూనివర్సిటీలకు అవసరమని, అందుకోసం ఏజ్ లిమిట్ పెంచనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం.. యూనివర్సిటీలను సమాజానికి కావాల్సిన నాయకత్వాన్ని తయారు చేసే వేదికలుగా తయారు చేస్తామని అన్నారు. 

Also Read :- పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా?

ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు వేదిక మీది నుంచి జారీ చేస్తున్నట్లు తెలిపారు.