ఆదిలాబాద్ అంటే CM రేవంత్‎కు అమితమైన ప్రేమ: మంత్రి సీతక్క

ఆదిలాబాద్ జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డికి అమితమైన ప్రేమ అని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో ఈ ప్రాంత సమస్యలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శనివారం ఉట్నూర్‎లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీడీఏ నిధులకు నోచుకోలేదని.. తమ ప్రభుత్వంలో ఐటీడీఏను బలోపేతం చేసి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆదివాసులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంతంలో ఆడబిడ్డలను పెళ్లిళ్లు చేసుకొని కొందరు భూములు రాయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో దీనిపై నివేదికలను తెప్పించుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ALSO READ | నేడు ఉట్నూరుకు మంత్రి సీతక్క