న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌లో మా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళా చనిపోగా.. ఆమె కొడుకు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
ALSO READ | హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఒక ప్రాణం పోయినా అరెస్ట్ చేయవద్దా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పు ఎవరూ చేసిన తప్పే.. చట్టం ముందు అందరూ సమానులే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ దేశంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు అరెస్ట్ కాలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా స్టార్స్, పొలిటికల్ స్టార్స్ కు ప్రత్యేకంగా చట్టం ఉండదని.. తప్పు ఎవరు చేసిన తప్పేనని అన్నారు.
ALSO READ | Allu Arjun case : అల్లు అర్జున్ అరెస్ట్పై ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు..
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్తే అయిపోయిదే.. కానీ ఆయన కారులోంచి బయటకు వచ్చి హంగామా చేశాడు.. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎగబడ్డారు. జనాన్ని కంట్రోల్ చేయలేక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళా ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు ఇంకా ఐసీయూలో ఉన్నాడని తెలిపారు. అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీ నేత.. అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ మా కాంగ్రెస్ పార్టీ.. అల్లు అర్జున్ అత్తగారు మాకు బంధువులు.. అలాగని తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఉండలేం కదా..
ALSO READ | అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన కేటీఆర్, హరీష్ రావు.. ఏమన్నారంటే..?
ఒకవేళ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయకపోతే సెలబ్రెటి అని.. లేదా సీఎం చుట్టాలు కావడంతోనే అరెస్ట్ చేయలేదని అంటారు.. అరెస్ట్ చేస్తేనేమో ఎందుకు చేశారంటున్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు.. మరీ చనిపోయిన మహిళా.. ఆమె కుమారుడి గురించి ఎవరూ అడగటం లేదు.. బాధిత కుటుంబానికి జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా వాళ్లు పైసలు పెట్టారు.. లాభాలు సంపాదించారు.. వాళ్లు దేశం కోసం చేసిందేమైనా ఉందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ నా దగ్గరే ఉందని.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలుసని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని క్లారిటీ ఇచ్చారు.