ఆ క్యాప్సికమ్ టెక్నిక్ ఏదో చెప్పండి.. కేసీఆర్ కు సీఎం రేవంత్ రిక్వెస్ట్

 ఆ క్యాప్సికమ్ టెక్నిక్ ఏదో చెప్పండి.. కేసీఆర్ కు సీఎం రేవంత్ రిక్వెస్ట్

స్టేషన్ ఘన్పూర్  లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్-క్యాప్సికమ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి నవ్వులు పూయించారు. ‘‘కేసీఆర్ ఫామ్ హౌజ్ లో క్యాప్సికమ్ పండించి లక్షలు సంపాదిస్తున్నారంట.. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ ప్రజలకు చెప్పరా కేసీఆర్ గారు. మీ లక్ష కోట్ల ఆస్తులు ఎట్ల పెరిగినయో చెప్పాలి.. నైపుణ్యం ఏంటో మా నిరుద్యోగులకు చెప్పాలి. మీకు రావడానికి ఇబ్బంది అనిపిస్తే.. విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని ఫామ్ హౌజ్ కు పంపిస్త.. ఆ టెక్నిక్స్ మా నిరుద్యోగులకు చెప్పండి. వాళ్లు కూడా బాగుపడతరు కదా. సంపాదించడం నేర్చుకుంటరు కదా..’’ అని అన్నారు సీఎం రేవంత్. 

రూ. 58 లక్షల జీతం తీసుకుని ఫాం హౌజ్ లో పడుకుంటారా, జీతం తీసుకుని ఎందుకు రారని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు.. ఉద్యోగానికి రాకుండా జీతం తీసుకోవడం ఎక్కడైనా ఉంటుందా..? ఫామ్ హౌజ్ లో పడుకుంటారా జీతం తీసుకుని.. మీ అనుభవం, విజ్ఞానం  ప్రజలకు పంచరా..?’’ అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ | పిల్ల కాకులతో నాకెందుకు.. కేసీఆర్ను రమ్మను మాట్లాడదాం : సీఎం రేవంత్

‘‘మీరు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు.. టీవీలు పేపర్లు పెట్టుకున్నారు.. ఆనాటి ధనిక రాష్ట్రాన్ని.. ఈ నాడు దివాలా తీయించారు.. ఆడబిడ్డల గురించి, ఆర్టీసీ బస్సుల గురించి, సోలార్, పావల వడ్డీ, మహిళా సంఘాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ’’ అని తీవ్రస్థాయిలో మండి పడ్డారు. 

‘‘పదేళ్ల పాలనలో ప్రొ.జయశంకర్ సార్ ఊరిని కూ డా పట్టించుకోలేదు.. ఈ ప్రభుత్వం వచ్చినంకనే వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగు రోడ్డు, మామునూరు ఎయిర్ పోర్టు, 800 కోట్ల రూపాయలు స్టేషన్ ఘన్ పూర్ కు ఇవ్వగలిగినం,, 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించగలుగుతున్నాం’’ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.