ఈ చిత్రాలు.. అద్భుతం.. ఆధ్యాత్మికం.. ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్..

ఈ చిత్రాలు.. అద్భుతం.. ఆధ్యాత్మికం.. ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్..

ప్రముఖ చిత్రకారుడు ఎ.నరేందర్​ ‘ది ఎటర్నల్​మెస్మరైజర్’ పేరిట మాదాపూర్​ చిత్రమయి స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో సోమవారం సోలో పెయింటింగ్​ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని ప్రారంభించారు. 

ఎమ్మెల్యేలు డా.రాజేశ్​రెడ్డి, మధుసూదన్​రెడ్డితో కలిసి ఎగ్జిబిషన్ మొత్తం కలియతిరిగారు. నరేందర్ ​గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని.. ఆధ్మాత్మికతకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని రేవంత్​రెడ్డి ప్రశంసించారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్ వచ్చే నెల​ 4వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

 – వెలుగు, మాదాపూర్