హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటర్ కప్ 2024 ను ప్రారంభించారు రేవంత్ . భారత్ వర్సెస్ మారిషస్ మ్యాచ్ ను ప్రారంభించిన సీఎం .. హైదరాబాద్ లో ఇంతపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ఫుట్ బాల్ కి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించబోతున్నామని తెలిపారు. భారత్ కి స్పోర్ట్స్ రాజధానిగా హైదరాబాద్ ని మారుస్తామన్నారు రేవంత్.
ఆఫ్రో ఏసియన్ గేమ్స్ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. 15 ఏళ్ల తర్వాత గచ్చిభౌలిలో అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 6న సిరియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ జరగనుంది. 9వ తేదిన భారత్ వర్సెస్ సిరియా మ్యాచ్ జరగనుంది. ఈ పోటీల కోసం 15కోట్ల రూపాయలతో గచ్చిబౌలి స్టేడియాన్ని రెనొవేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా 20వేల బకెట్ కుర్చీలను ఏర్పాటు చేసింది.