జపాన్లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. చారిత్రాత్మక స్థలాల సందర్శన..

జపాన్లో సీఎం  రేవంత్ బిజీ బిజీ.. చారిత్రాత్మక స్థలాల సందర్శన..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (ఏప్రిల్ 22, మంగళవారం) జపాన్ లో బిజీబిజీగా గడిపారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్ వెళ్లిన తెలంగాణ రైజింగ్ టీమ్ ఇవాళ హిరోషిమా నగరాన్ని సందర్శించింది. సీఎం రేవంత్రెడ్డి మంత్రి శ్రీధరాబాబుతో కలిసి జాతిపిత, శాంతిదూత మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం హిరోరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అటామిక్ బాంబ్ డోమ్ ను వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబు దాడిలో మరణించిన వారి స్మృతి చిహ్నం వద్ద పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.

►ALSO READ | ఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. చాలా లోపాలున్నాయి: రాహుల్ గాంధీ