న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఆ జాబితాలో ఉన్నారు.
ఈమేరకు మొత్తం 40 మందితో ఉన్న లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.కాగా.. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.