అధికార పక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్

అధికారపక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఎలాంటి భేషాజాలు లేవని..ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని తెలిపారు. ప్రస్తుతం చట్ట సభల స్ఫూర్తిని కోల్పోతున్నామని, విపక్షాల విమర్శలు చేయడానికి ,సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షానికి విలువ  ఇస్తోందని, అప్పటివరకు అసెంబ్లీలో ఒక్క సభ్యుడిని  కూడా సస్పెండ్ చేయలేదని గుర్తుచేశారు.

 గతంలో విశ్వవిద్యాలయాల నుండి రాజకీయ నేతలు వచ్చారని తెలిపారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ 'ఉనికి' పుస్తకాన్ని సీఎం. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ గవర్నర్లు బండారు దత్తాత్రేయ. హరిబాబు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ లక్ష్మి బీ తదితరులు హాజరయ్యారు. 

ALSO READ | విద్యాసాగర్ రావు మచ్చలేని మనిషి.. ‘ఉనిక’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ 'అసెంబ్లీలో అధికారపక్షమే కాదు ప్రతిపక్షం కూడా ముఖ్యమే. ఇప్పటి వరకు శాసనసభలో ఏ ఒక్క ప్రతిపక్షసభ్యుడి ని సస్పెండ్ చేయలేదు. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నం. దేశాభి వృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్త. పెండింగ్ జెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరాను. కాజీపేట రైల్వే డివిజన్, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ విస్తరణకు బండి సంజయ్ కేంద్రంతో మట్లాడాడాలి.  స్కిల్ వర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నం. తెలంగాణ నుంచి ఒలిం సెక్స్ లో పతకం సాధించడానికి కృషి చేస్తున్ను త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేస్తం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాలో అన్ని పార్టీలు కలిసిపో ఆడుతున్నాయి" అని తెలిపారు.

 ఒక్క మరకలేదు

 విద్యాసాగర్ రావు ఆదర్శనీయమైన నేత.  సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా ఒక్క మరక లేదు. ఇంత వరకు వ్యక్తిగతంగా ఎవరూ ఆరోపణలు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారు. గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు ఉద్యమించారు. కానీ ఆయన కల ఇప్పటికీ నెరవేరలేదు. మ్మిడిహెట్టి భూసేకరణకు తీసుకుంటం. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటం' అని సీఎం రేవంత్ చెప్పారు.