
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుతో పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఉద్యోగాల కల్పనలో నెంబర్ 1గా నిలిచామన్నారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆమ్జెన్ను ప్రారంభించాం.. హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సు కూడా నిర్వహించామని గుర్తు చేశారు. హెచ్సీఎల్ టెక్ కంపెనీ దేశానికి గర్వ కారణమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇదే కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తు్న్నారని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇందుకోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీలో హెచ్సీఎల్ భాగస్వామ్యం కావాలని కోరారు.