వ‌‌ర‌‌ద న‌‌ష్టం ప‌‌నుల‌‌కు 11,713 కోట్లు రిలీజ్ చేయండి

వ‌‌ర‌‌ద న‌‌ష్టం ప‌‌నుల‌‌కు 11,713 కోట్లు రిలీజ్ చేయండి
  • తక్షణ సాయం కింద రూ.5,438 కోట్లు ఇవ్వండి 
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ విన‌‌తి
  • విభ‌‌జ‌‌న స‌‌మ‌‌స్యలను ప‌‌రిష్కరించండి
  • రాష్ట్రానికి మరింత మంది ఐపీఎస్​లను కేటాయించాలి
  • తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించేందుకు ఉన్నతమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు వెల్లడి
  • ఢిల్లీలో ఎల్​డబ్ల్యూఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్, అధికారులు​
  • 2026 వరకు నక్సలిజాన్ని నిర్మూలిస్తం : అమిత్​ షా

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో ఇటీవల కురిసిన భారీ వ‌‌‌‌‌‌‌‌ర్షాల‌‌‌‌‌‌‌‌కు దెబ్బతిన్న మౌలిక వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తుల పున‌‌‌‌‌‌‌‌రుద్ధర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ్మతు ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు రూ.11,713.49 కోట్లు రిలీజ్​ చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్​ కోరారు. తక్షణ సాయం కింద రూ. 5,438 కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్​ చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ స‌‌‌‌‌‌‌‌మావేశంలో ఎంపీ ర‌‌‌‌‌‌‌‌ఘువీర్ రెడ్డి, ఎస్సార్ ఏపీ జితేంద‌‌‌‌‌‌‌‌ర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎం సెక్రటరీ శేషాద్రి, డీజీపీ జితేంద‌‌‌‌‌‌‌‌ర్ పాల్గొన్నారు.  ఆగ‌‌‌‌‌‌‌‌స్టు 31 నుంచి సెప్టెంబ‌‌‌‌‌‌‌‌ర్ 8 వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు కురిసిన భారీ వ‌‌‌‌‌‌‌‌ర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయ‌‌‌‌‌‌‌‌ని సీఎం తెలిపారు. 

37 మంది ప్రాణాలు కోల్పోయార‌‌‌‌‌‌‌‌ని, ల‌‌‌‌‌‌‌‌క్షకుపైగా ప‌‌‌‌‌‌‌‌శువులు, ఇత‌‌‌‌‌‌‌‌ర మూగజీవాలు మృతిచెందాయ‌‌‌‌‌‌‌‌ని, 4.15 ల‌‌‌‌‌‌‌‌క్షల ఎక‌‌‌‌‌‌‌‌రాల్లో పంటలతోపాటు రోడ్లు, క‌‌‌‌‌‌‌‌ల్వర్టులు, కాజ్‌‌‌‌‌‌‌‌వేలు, చెరువులు, కుంట‌‌‌‌‌‌‌‌లు, కాలువ‌‌‌‌‌‌‌‌లు దెబ్బతిన్నాయ‌‌‌‌‌‌‌‌ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాము మౌలిక వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తుల పున‌‌‌‌‌‌‌‌రుద్ధర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌తోపాటు మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ్మతు ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌ను వెంట‌‌‌‌‌‌‌‌నే చేప‌‌‌‌‌‌‌‌ట్టామ‌‌‌‌‌‌‌‌ని వివ‌‌‌‌‌‌‌‌రించారు. ఆయా ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు రూ.5,438 కోట్లు విడుద‌‌‌‌‌‌‌‌ల చేయాల‌‌‌‌‌‌‌‌ని సెప్టెంబ‌‌‌‌‌‌‌‌ర్​ 2న తాను లేఖ రాసిన విష‌‌‌‌‌‌‌‌యాన్ని  అమిత్ షాకు గుర్తు చేశారు. వరద నష్టం, విభజన చట్టంలోని హామీల అమలు, ఐఏఎస్, ఐపీఎస్ ల సంఖ్య పెంపు ఇతర అంశాలపై అమిత్​షాతో చర్చించారు.  

రాష్ట్రంలో పంట‌‌‌‌‌‌‌‌లు, ఇత‌‌‌‌‌‌‌‌ర న‌‌‌‌‌‌‌‌ష్టాల‌‌‌‌‌‌‌‌పై కేంద్ర బృందం ప‌‌‌‌‌‌‌‌ర్యటించి,  రూ.11,713 కోట్ల మేర న‌‌‌‌‌‌‌‌ష్టం వాటిల్లింద‌‌‌‌‌‌‌‌ని సెప్టెంబ‌‌‌‌‌‌‌‌రు 30న నివేదిక స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్పించింద‌‌‌‌‌‌‌‌ని సీఎం తెలిపారు. పున‌‌‌‌‌‌‌‌రుద్ధర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ్మతుల ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు ఆ నిధులు ఎంత‌‌‌‌‌‌‌‌మాత్రం స‌‌‌‌‌‌‌‌రిపోవ‌‌‌‌‌‌‌‌ని అన్నారు. అయినా..వాటిని ఇప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు విడుద‌‌‌‌‌‌‌‌ల చేయ‌‌‌‌‌‌‌‌నందున.. వెంట‌‌‌‌‌‌‌‌నే  రిలీజ్​ చేయాల‌‌‌‌‌‌‌‌ని కోరారు. 2024-–25 ఏడాదికి గాను ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్ మొద‌‌‌‌‌‌‌‌టి, రెండో విడ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల కింద తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు రూ.416.80 కోట్లను కేంద్రం విడుద‌‌‌‌‌‌‌‌ల చేసింద‌‌‌‌‌‌‌‌ని సీఎం తెలిపారు. 

పున‌‌‌‌‌‌‌‌రుద్ధర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ్మతు ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు విడుద‌‌‌‌‌‌‌‌ల చేసే నిధుల‌‌‌‌‌‌‌‌ను, గ‌‌‌‌‌‌‌‌తంలోని ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్ ప‌‌‌‌‌‌‌‌ను ల‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన నిధుల ఉప‌‌‌‌‌‌‌‌యోగానికి ముడిపెట్టవ‌‌‌‌‌‌‌‌ద్దని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన నిధుల‌‌‌‌‌‌‌‌ను ఈ ఆర్థిక సంవ‌‌‌‌‌‌‌‌త్సరంలోనే వ్యయం చేస్తామ‌‌‌‌‌‌‌‌ని  తెలిపారు.  

విభ‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలపై దృష్టిపెట్టండి

ఏపీ విభజన చట్టం అమలుకు సంబంధించి కేంద్ర హోం శాఖ నోడల్ ఆఫీసుగా ఉన్నదని, ఈ నేపథ్యంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రాష్ట్ర పున‌‌‌‌‌‌‌‌ర్విభ‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల ప‌‌‌‌‌‌‌‌రిష్కారంపై దృష్టిపెట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. షెడ్యూల్ 9లోని (చ‌‌‌‌‌‌‌‌ట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం)  ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10లోని సంస్థల వివాదం (చ‌‌‌‌‌‌‌‌ట్టంలోని 75 సెక్షన్ ప్రకారం) సామ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌స్యపూర్వక‌‌‌‌‌‌‌‌ ప‌‌‌‌‌‌‌‌రిష్కారానికి కృషి చేయాల‌‌‌‌‌‌‌‌ని రిక్వెస్ట్ చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నదని అమిత్​షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు న్యాయం జ‌‌‌‌‌‌‌‌రిగేలా చూడాల‌‌‌‌‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు.

అదనంగా 29 ఐపీఎస్  పోస్టులు కేటాయించండి..

డ్రగ్స్ కంట్రోల్, ఇతర కీలక అంశాలు, పాలనా సౌలభ్యం కోసం  రాష్ట్రానికి అద‌‌‌‌‌‌‌‌నంగా 29 ఐపీఎస్ పో స్టులు కేటాయించాల‌‌‌‌‌‌‌‌ని  అమిత్ షాను  రేవంత్ కోరారు. రాష్ట్ర పున‌‌‌‌‌‌‌‌ర్విభ‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యంలో తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌‌‌‌‌‌‌‌ను మాత్రమే కేటాయించార‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఐపీఎస్ క్యాడ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌పై రివ్యూ  చేప‌‌‌‌‌‌‌‌ట్టాల‌‌‌‌‌‌‌‌ని, అదనపు పోస్టులు కేటాయించాలని రిక్వెస్ట్​ చేశారు. 

ఆ 3 జిల్లాలను ఎల్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఈలో కొన‌‌‌‌‌‌‌‌సాగించాలి 

వామ‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌క్ష తీవ్రవాద ప్రభావిత (ఎల్‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌బ్ల్యూఈ) జిల్లాల నుంచి తొల‌‌‌‌‌‌‌‌గించిన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల‌‌‌‌‌‌‌‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌‌‌‌‌‌‌‌ను తిరిగి చేర్చాల‌‌‌‌‌‌‌‌ని అమిత్ షాను సీఎం రేవంత్ కోరారు. ఎల్‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌బ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మ‌‌‌‌‌‌‌‌హారాష్ట్ర, చత్తీస్‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ఢ్‌‌‌‌‌‌‌‌తో తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు సరిహ ద్దు ఉండడంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంత‌‌‌‌‌‌‌‌ర్గత భ‌‌‌‌‌‌‌‌ద్రత‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్  జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల విజ్ఞప్తి చేశారు. 

ఎస్పీవోల‌‌‌‌‌‌‌‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేండ్ల నుంచి పెండింగ్​లో ఉంద‌‌‌‌‌‌‌‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవ డానికి నిబంధనలు స‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌లించాలని రిక్వెస్ట్​ చేశారు. తెలంగాణ సరిహద్దుల్లోని మ‌‌‌‌‌‌‌‌లుగు జిల్లా పేరూరు, ములుగు, క‌‌‌‌‌‌‌‌న్నాయిగూడెం, భూపాల‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ల్లి జిల్లాలోని ప‌‌‌‌‌‌‌‌లిమెల‌‌‌‌‌‌‌‌, మహాముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేష‌‌‌‌‌‌‌‌న్లను బ‌‌‌‌‌‌‌‌లోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పా రు. తెలంగాణ పోలీస్ శాఖలో కొత్తగా నియ‌‌‌‌‌‌‌‌మితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో (ఏఈటీ) శిక్షణ ఇప్పిస్తున్నట్టు చెప్పారు.

2024–-25 ఏడాదిలో ఈ ర‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌మైన శిక్షణ‌‌‌‌‌‌‌‌కు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ని, ఆ మొత్తాన్ని విడుద‌‌‌‌‌‌‌‌ల చేయాల‌‌‌‌‌‌‌‌న్నారు. ఆధునిక అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా పోలీసు ద‌‌‌‌‌‌‌‌ళాలను తీర్చిదిద్దే ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు ఉద్దేశిం చిన ప్రత్యేక మౌలిక‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తుల ప‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కం(ఎస్ఐఎస్‌‌‌‌‌‌‌‌)కు రాష్ట్రానికి కేవ‌‌‌‌‌‌‌‌లం రూ.6.70 కోట్లు మాత్రమే విడుద‌‌‌‌‌‌‌‌ల చేశార‌‌‌‌‌‌‌‌ని,  అద‌‌‌‌‌‌‌‌నంగా రూ.23.56 కోట్లు విడుద‌‌‌‌‌‌‌‌ల చేయాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్​ కోరారు.

నక్సలిజం నిర్మూలనే టార్గెట్ : అమిత్ షా

దేశంలో 2026 వరకు వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిద్దామనిహోం మంత్రి అమిత్ షా మరోసారి పిలుపునిచ్చారు. ఆ దిశలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పని చేయాలని కోరారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన కోసం 2014-24 వరకు నక్సల్స్  ప్రభావిత ప్రాంతాల్లో రూ.3,006 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.  ప్రస్తుతం మావోయిస్టుల మనుగడ కష్టంగా మారిందని, వారిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు సీఎం, డీజీపీ 15 రోజులకోసారి నక్సలిజం నిర్మూలనపై రివ్యూ చేయాలని సూచించారు.

అభివృద్ధి, సంక్షేమం మా ప్రణాళిక

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించేందుకు తెలంగాణ ఉన్నతమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు 2026 ను టార్గెట్ గా పెట్టుకున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. సోమవారం ఉదయం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావితం (ఎల్ డబ్ల్యూఈ) ఉన్న దాదాపు 9 రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారుల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, సీఎం చీఫ్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వి.శివధర్ రెడ్డి, ఎస్ఐబీ ఐజీ బి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సుమతి  పాల్గొన్నారు. తొలుత దేశంలో తీవ్రవాద నిర్మూలన దిశలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, పలు ప్రాంతాల్లో నక్సలైట్ల ఉనికి అంశాలపై హోం శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం రాష్ట్రాలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలు, సహకారంపై చర్చించింది. 2026 కల్లా నక్సలిజాన్ని నిర్మూలిద్దాం, వామపక్ష తీవ్రవాదం మానవాళికి వ్యతిరేకమనే అజెండాతో సమావేశం సాగింది. 

ఈ సందర్భంగా వామపక్ష తీవ్రవాద నిర్మూలన దిశలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర అధికారులు తెలిపారు. అలాగే, టెర్రరిజాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని, పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి చొరబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో (ఏఈటీ) శిక్షణ ఇప్పిస్తున్నట్టు వెల్లడించారు. 2024-25 ఏడాదిలో ఈ ర‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌మైన శిక్షణ‌‌‌‌‌‌‌‌కు అదనపు బడ్జెట్ కేటాయించాలని కోరారు.