పిల్ల కాకులతో నాకెందుకు.. కేసీఆర్ను రమ్మను మాట్లాడదాం : సీఎం రేవంత్

పిల్ల కాకులతో నాకెందుకు.. కేసీఆర్ను రమ్మను మాట్లాడదాం : సీఎం రేవంత్

తెలంగాణ అప్పులు, అభివృద్ధిపై, రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై పిల్లకాకులతో కాకు.. డైరెక్ట్ గా కేసీఆర్ తోనే మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్ రావు పిల్ల కాకులలాగ ఎగసిపడుతున్నారని, వారితో మాట్లాడాల్సిన పనిలేదని అన్నారు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మాట్లాడేందుకు, ఏ విషయంపై అయినా చర్చకు సద్ధమని సవాల్ విసిరారు. 

‘‘మీ అల్లడు, కొడుకు పిల్ల కాకులు. వాళ్లేదో అరుస్తుంటరు. కాంగ్రెస్ దెబ్బ ఏంటో మీకు తెలుసు. 2023 డిసెంబర్ లో చూశారు కదా.. అందుకే మీరు రండి కేసీఆర్. మీరెప్పుడొస్తే అప్పుడు చర్చకు నేను సిద్ధం.. ’’ అని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేయలేదని హరీశ్ రావు అంటున్నారని, ‘‘శ్రీరాంసాగర్ మీతాత గట్టిండా, శ్రీశైలం లో నీటి నిల్వ మీ ముత్తతా చేసిండా’’ అని ఘాటు ప్రశ్నలు వేశారు. తెలంగాణలో శ్రీశైలం, నాగార్జున సాగర్, నెట్టెంపాడు, జూరాల ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవేనని తెలిపారు. 

Also Read:-తాగుబోతోడు జాతిపిత అయితడా.. త్యాగాలు చేసినోళ్లు జాతిపిత అయితరా?

కానీ బీఆర్ఎస్ కట్టిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం కూలి పోయిందని, అది కూళేశ్వరం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందంటే మీకు ప్రశ్నించే అర్హత ఎక్కడిదని అన్నారు.