
హైదరాబాద్: మంచిరేవులలో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం స్టూండెంట్లతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
మంచిరేపులలో ఏర్పాటైన ఈ పాఠశాలలో ప్రస్తుతానికి ఐదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. యాభై శాతం అడ్మిషన్లు పోలీసుల పిల్లలకు కేటాయిస్తుండగా మరో యాభై శాతం ఇతరులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ కార్య్రమానిని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం హాజరయ్యారు