పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్

పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు  కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్

పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  పక్క రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) 5 ఇచ్చినప్పుడు తమ రాష్ట్రానికి 4 ఇచ్చినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రధాని మరో అన్యాయం చేశారని, దీనిపై త్వరలో లేఖ రాయనున్నట్లు తెలిపారు. 

Also Read :- రాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర

రాష్ట్రం నుంచి గద్ధర్, గోరటి, జయధీర్ వంటి మేధావులు, ఉద్యమకారుల లిస్టును పంపామని, పరిగణనలోకి తీసుకోక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. మంద కృష్ణకు అవార్డు ఇవ్వడం ఆహ్వానిస్తున్నామని.. అదేవిధంగా తాము పంపించిన లిస్టులను పరిగణలోకి తీసుకుని రాష్టరానికి పద్మ పురస్కారాలు ఇవ్వాల్సిందని అన్నారు.