సోషల్ మీడియాలో ఏంటా భాష..? గుడ్డలు ఊడదీసి కొడతాం ఒక్కొక్కరిని: సీఎం రేవంత్

సోషల్ మీడియాలో ఏంటా భాష..? గుడ్డలు ఊడదీసి కొడతాం ఒక్కొక్కరిని: సీఎం రేవంత్

= హద్దు దాటితే ఊరుకునేది లేదు
= అమ్మ, చెల్లిపై పోస్టులు పెడ్తే ఊకుంటరా.. ఉరికిచ్చి కొడ్తరు
= జర్నలిస్టు ముసుగేసుకొని వస్తే బట్టలూడదీసి కొడ్త
= ఆడబిడ్డల మీద పోస్టులు పెడ్తె తోడ్కలు తీస్తం 
= అసెంబ్లీలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: సోషల్ మీడియాలో పోస్టులపై సీఎం రేవంత్  రెడ్డి ఫైర్ అయ్యారు. ‘సోషల్‌ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు’ అని సీఎం అన్నారు.  ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నామని,  లేదంటే ఒక్కడు బయట తిరగలేడని అన్నారు.  అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.  హద్దు దాటితే ఇకపై ఊరుకోబోమని అన్నారు. 

జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వాలని,  ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని,  తోడ్కలు తిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం మట్లాడుతూ.. ‘నన్ను తిట్టిన తిట్లకి.. మీ పేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్న. కాదు అంటే.. ఒక్కొక్కడు బయట తిరగడు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటితే . ఊరుకోను ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తది అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తం. ఆడ పిల్లలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఏం బాగుంటుంది. 

Also Read:-డ్రగ్స్ కేసులో దొరికితే.. కరెంటు, నీళ్లు కట్...

కేసీఆర్.. మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతర వేస్తం. మీడియా సంఘాలూ  మీరైనా చెప్పండి. కుర్చీలో ఉన్న అని.. ఊరుకుంటారు అనుకుంటున్నారు. చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. విశ్రుంఖలత్వం ఆపండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటది. దీనిపై  చట్టం చేద్దాం. నా ఒక్కరి ఆవేదన కాదు.. ఇది అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి.” అని సీఎం రేవంత్ అన్నారు.