మోడీ కన్వర్టెడ్ బీసీ.. దమ్ముంటే కేంద్రం కుల గణన చేయాలి: సీఎం రేవంత్ సవాల్

మోడీ కన్వర్టెడ్ బీసీ.. దమ్ముంటే కేంద్రం కుల గణన చేయాలి: సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  మోడీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని.. అన్ని తెలుసుకునే ఆయన కులం గురించి మాట్లాడుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన నివేదికను తప్పు అంటూ మోడీ, కేడీ బీసీలను మో సం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 

కుల గణన, ఎస్సీ వర్గీకరణపై శుక్రవారం (ఫిబ్రవరి 14) గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సర్టిఫికేట్స్‎లో మోడీ బీసీ కానీ.. ఆయన మనసు అంత బీసీ వ్యతిరేకి అని విమర్శించారు. 

ALSO READ | చంద్రబాబు, KCR వచ్చింది యూత్ కాంగ్రెస్ నుంచే.. అది యూత్ కాంగ్రెస్ పవర్: సీఎం రేవంత్

కేంద్రం జన గణనతో పాటు కులగణన చెయ్యాలి. అప్పుడు కేంద్ర లెక్కలు, మా ప్రభుత్వ లెక్కలను సరిపోల్చి చూద్దామని సవాల్ విసిరారు. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్‎లను బహిష్కరణ చెయ్యాలి.. బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్నానని అన్నారు.  ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మనం కుల గణన విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోడీపై ఒత్తిడి వస్తుందనే భయంతో మన సర్వేను తప్పుడు సర్వే అని బీజేపీ వాళ్లు అంటున్నారని ఫైర్ అయ్యారు. సర్వేలో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులను బీసీలు నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు వింటే బీసీలకు తీరని నష్టం జరుగుతోందన్నారు.