జమిలీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

జమిలీ ఎన్నికలపై  సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

జమిలీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.  లోక్ సభ  ఎన్నికలు 2029లోనే జరుగుతాయన్నారు . కేంద్రం జమిలీ ఎన్నికలు జరిపితే 2028లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయి... అపుడు అసెంబ్లీ టర్మ్ ను  మరో 6 నెలల పొడిగించే అవకాశం ఉందన్నారు.  ఈ నాలుగేళ్లలో తెలంగాణను  అభివృద్ధి చేసుకుందామన్నారు రేవంత్. తాను రాజకీయాలు చూడనని..తన దగ్గరకు ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా  సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు సీఎం రేవంత్. హరీశ్ రావు వచ్చినా..కేసీఆర్ వచ్చినా ఒక సీఎంగా వాళ్ల నియోజకవర్గాల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు రేవంత్.

ఉప ఎన్నికలు రావు

మరో వైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కూడా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 26న అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్..పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చెబుతున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో  ఎలాంటి సంప్రదాయం ఉందో అదే సంప్రదాయాన్ని మేం ఫాలో అవుతున్నాం. . పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. మేం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వాళ్ల అడుగుజాడల్లో మేం నడవడం లేదు. ప్రతి రోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు..అభివృద్దిపైనే ఉంది. అని రేవంత్ అన్నారు.

ALSO READ | తెలంగాణలో ఎలాంటి ఉపఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు టెన్షన్ పడొద్దు: సీఎం రేవంత్