గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్

గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్

కోస్గి మండలం చంద్రవంచాలో 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేండ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇవాళ కొడంగల్ వైపు రాష్ట్ర ప్రజలు చేస్తున్నారని  అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని..రేపటి నుంచి రైతు భరోసా నిధులు అకౌంట్లో పడతాయని అన్నారు. 25లక్షల 50వేల మంది రైతులకు రుణ విముక్తి కల్పించామని అన్నారు. 

50లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.రైతులకు ఉచిత కరెంట్ అమలు చేసింది కాంగ్రెస్సే అని.. అన్నారు సీఎం రేవంత్. భూమి లేని దాదాపు 10 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందని అన్నారు. తమ హయాంలో నియోజకవర్గానికి 3వేల 500 ఇండ్లు ఇవ్వబోతున్నామని అన్నారు సీఎం రేవంత్.

ALSO READ | పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్

ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేరుస్తామని.. రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలే రాజులు, ప్రజలే పాలకులని అన్నారు. ఇవి అద్భుతమైన 4 సంక్షేమ పధకాలని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.