రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతం..ఎవరైనా అడ్డుకుంటే వీపులు పగుల్తయ్: సీఎం రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ లో  రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వీపు విమానాల మోత మోగిస్తామన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పారు రేవంత్. దేశాన్ని మోదీ,అమిత్ షా..అదానీ,అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. సెబీ అక్రమాలపై కేసీఆర్,కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

Also Read :- ఛైర్మన్ను సస్పెండ్ చేయాలి

  • మోదీ ప్రజల సొమ్మును షేర్ మార్కెట్ల ద్వారా అదానీకి దోచిపెట్టారు
  • హెండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపించాలి
  • సెబీ ఛైర్మన్ పై ఆరోపణలపై చట్ట సభల్లో కాంగ్రెస్  పోరు చేసింది
  • అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారు
  • అదానీపై జేపీతో విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు
  •  జేపీసీ వేయాలని పార్లమెంట్ లో డిమాండ్ చేస్తే మోదీ తప్పుకున్నారు
  • నాలుగు రోజుల ముందే పార్లమెంట్ ను వాయిదా వేశారు
  • మోదీ తన పరివారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
  •  మోదీ దేశాన్ని,అదానీ, ప్రధానీ లూటీ చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నాం
  •  దేశాన్ని లూటీ చేసేవారిని జైల్లో వేయాలి
  • మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ అప్పు 55లక్షల కోట్లు
  • ఇపుడు దేశం మొత్తం అప్పు  కోటి 55 లక్షల కోట్ల అప్పులు చేశారు
  •  దేశ సంపదను దోచుకున్న వారిని జైల్లో పెట్టే వరకు పోరాడుతాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చింది
  • కంప్యూటర్ రివల్యూషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ
  •  స్థానిక సంస్థల్లో  రిజర్వేషన్లు తీసుకొచ్చింది రాహుల్ గాంధీ
  • పేదలకు భూములు పంచిన ఘనత రాజీవ్ ది
  •   రాజీవ్ తోనే దేశంలో ఐటీ అభివృద్ధి
  • పీవీ సంస్కరణలతోనే  దేశాభివృద్ధి
  • దేశాని నలుగురు గుజరాతీలు దోచుకుంటున్నారు
  •  మోదీ,అమిత్ షా అంబానీ,అదానీలకు దోచి పెడుతున్నారు
  •   ఇందిరాగాంధీ బ్యాంకులను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు
  •  బీజేపీ దోపిడిపై బీఆర్ఎస్ ఎందకు ప్రశ్నించడం లేదు
  • మోదీ మీద కొట్లాడుతామన్న సన్నాసులు ఏమయ్యారు
  • దేశానికి బీజేపీ ముప్పులా మారింది
  •   ప్రతి చిల్లర విషయంలో స్పందించే కేటీఆర్ దీనిపై ఎందుకు స్పందించరు
  • అదానీ అవినీతిపై కేసీఆర్,కేటీఆర్ ఎందుకు స్పందించరు
  • బీజేపీ,బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబాట్టే మాట్లాడటం లేదు
  • సెబీ అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదు
  •  రాజీవ్ విగ్రహం తీసేస్తాం.. ఎయిర్ పోర్టు పేరును మారుస్తామంటున్నారు
  • బీజేపీని సంతోష పెట్టడానికి రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామంటున్నారు
  • రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు చేస్తాం
  • సెక్రటేరియట్ లోపల డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం
  •  ఉద్యోగం ఊడిన తర్వాత తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా?
  • రాజీవ్ ఎంతో మంది యువకులకు స్ఫూర్తి
  • బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడ్తాం..ఎవడు అడ్డుకుంటారో చూస్తా
  • కేటీఆర్ కు వాళ్ల తండ్రి విగ్రహం పెట్టుకోవాలని ఉంది
  • నేను నా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నాం 
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు
  • ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం రెడీగా ఉంది
  • రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నాుర
  •  రుణమాఫీ కాని వాళ్లు ఆఫీసర్లను కలవండి
  • గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి..కాంగ్రెస్ పాలనపై చర్చకు రెడీ