
ఎస్ఎల్ బీసీ పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాపై కేసీఆర్ కుట్ర పన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదానికి కారణం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్.. ఎస్ఎల్ బీసీ, డిండీని పూర్తి చేసి ఉంటే నల్గొండ నీటి కష్టాలు తీరేవన్నారు.ఎక్కడ మృత్యుఘోష వినపడితే అక్కడ కేసీఆర్, హరీశ్ పైశాచికి ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ముందు కేసీఆర్, హరీశ్ రావు మోకరిల్లారని ధ్వజమెత్తారు రేవంత్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారని ఆరోపించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ సామార్థ్యాన్ని పెంచి రాయలసీమకు నీళ్లు తరలించారని ఆరోపించారు రేవంత్. పాలమూరు,నల్గొండ జిల్లాలను ఏడారిగా మార్చింది కేసీఆరేనని మండిపడ్డారు.
Also Read : కేసీఆర్ సభకు వచ్చింది రెండు సార్లే
జురాల నుంచి పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు తేవాలని చిన్నారెడ్డి కోరారు. ఆనాడు నిండు సభలో చిన్నారెడ్డిని కేసీఆర్ అవమానించారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 10 టీఎంసీలు ఏపీ తరలించుకుపోతుందని ఆరోపించారు. రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు రేవంత్.