పీసీసీ చీఫ్‌కు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన అల్లు అర్జున్ కేసుపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాకుండా ఆదేశాలు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మీడియా సమావేశాలు, చర్చల్లో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం ఆదేశించినట్టు పీసీసీ చీఫ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పుష్ప 2 బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్పొందుతున్న విషయం తెలిసిందే.