
కోల్‌బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియాకు చెందిన ఇద్దరు కార్యకర్తలపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం లీడర్ బెల్లం అశోక్, వికాస్ మరికొందరు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసిన ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు.
దీనిపై కాంగ్రెస్‌కు నాయకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని మందమర్రి ఎస్ఐ తెలిపారు.