కాళేశ్వరం కేసీఆరే కట్టారు..ఆయన కళ్ల ముందే కూలిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరానికి ఇప్పటి వరకు డీపీఆర్ లేదన్నారు. లక్షా 50 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ కట్టారని చెప్పారు. మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు నింపితే కూలిపోతుందని.. నిపుణుల కమిటీ తేల్చిచెప్పిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. టెక్నాలజీ లేని సమయంలోనే అతి పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నామన్నారు. క్వాలీటీ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య .. అందుకే మ్యాన్ మేడ్ వండర్ ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. ఇంజినీర్లు నిజాంసాగర్, శ్రీశైలం కట్టిన వాళ్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేక కాళేశ్వరం కట్టిన వాళ్లను ఆదర్శంగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వేసుకుండు.. ఆ ముసుగు పోయింది కాబట్టే ఆయన ఆటలు చెల్లడం లేదన్నారు రేవంత్.
తెలంగాణ భవిష్యత్ లో ఇంజినీర్లదే కీలక పాత్ర
తెలంగాణ భవిష్యత్ లో ఇంజినీర్లది కీలక పాత్ర అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డును మీరే నిర్మించబోతున్నారని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంపై బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దామన్నారు. ఎవరు అడ్డం వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొనసాగుతదన్నారు రేవంత్. మూసీ రివర్ ను ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దని ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం 7 వేల కోట్లు అప్పు చేశాం...మరో 10 వేల కోట్లు అప్పు చేస్తామన్నారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో విపక్షాలు సలహాలు ఇవ్వాలన్నారు. అద్భుతమైన మూసీని అభివృద్ధి చేసుకుందామన్నారు రేవంత్
Also Read :- మహిళ కడుపులో 2కేజీల వెంట్రుకలు
ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం
పదేళ్లలో ఏనాడైనా కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చారా? అని ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయువు పట్టు అని చెప్పారు. సమస్యలు పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఎంతోకాలం ఎదురు చూసి ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయారన్నారు. నిరుద్యుగుల వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిందన్నారు. మేం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు రేవంత్. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 1635 మంది కుటుంబాలకు ఈరోజు అతిపెద్ద పండుగ అని అన్నారు. వందలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలే ఈ నాడు తెలంగాణ అని చెప్పారు. ఏండ్లుగా మీ నిరీక్షణ ఇవాళ ఫలించబోతుందన్నారు. ఇది ఉద్యోగం కాదు..భావోద్వేగమన్నారు. రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు రేవంత్.