గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ కు తమ ఎక్స్ లో అభినందించారు.
చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు అని రేవంత్ ట్వీట్ చేశారు.
తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేనికృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణం అని అన్నారు.
టాలీవుడ్‌తో పాటు భారత సినీ చరిత్రలో తన ఆట, పాట, యాక్షన్‌తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. 156 సినిమాలు,537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డ్ దక్కింది.
I extend my heartiest congratulations to Mega Star and Padma Vibhushan awardee, @KChiruTweets Garu, on being recognised by The Guinness World Records as the Most Prolific Film Star in Indian Film Industry, Actor/ Dancer. He has made an unparalleled contribution to Telugu cinema… pic.twitter.com/v3Nhd2FPKV
— N Chandrababu Naidu (@ncbn) September 22, 2024