టీపీసీసీ కార్యవర్గ కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.. ఈమేరకు ఇవాళ లేదా రేపు ( ఫిబ్రవరి 7, 8 ) ప్రకటన వస్తుందని సమాచారం. గురువారం ( ఫిబ్రవరి 6, 2025 ) ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికలను అందజేశారు.
కుల గణన,వర్గీకరణ వల్ల ఆయా వర్గాలకు జరిగే ప్రయోజనాలను ఖర్గే కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి,భట్టిలను అభినందించారు ఖర్గే.
ఈ క్రమంలో నల్గొండ, మెదక్ లో నిర్వహించనున్న రెండు భారీ బహిరంగ సభలకి హాజరు కావాలని ఖర్గేను ఆహ్వానించారు సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.