రాష్ట్రపతికి సీఎం, గవర్నర్ ఘన స్వాగతం

రాష్ట్రపతికి సీఎం, గవర్నర్ ఘన స్వాగతం
  • ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది
  • 20న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్​హోం

హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్​లో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, సీఎం రేవంత్​ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సీఎస్​ శాంతి కుమారి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు.

పలు కార్యక్రమాల్లోనూ రాష్ట్రపతి పాల్గొంటారు. 20న సికింద్రాబాద్​లోని కాలేజ్‌‌ ఆఫ్‌‌ డిఫెన్స్‌‌ మేనేజ్​మెంట్​లో జరిగే కార్యక్రమంలో పాల్గొన నున్నారు. అదేరోజు సాయంత్రం రాష్ట్రపతి నిల యంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యా వేత్తలకు ఎట్‌‌ హోమ్‌‌ ఏర్పాటు చేశారు. 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తా రు. కోటిలోని మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవా ల్లో  పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం బేగం పేట ఎయిర్‌‌ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.